కోనసీమలో పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ బుధవారం తెలిపారు. డీజిల్ సరఫరా సాధారణ స్థితికి చేరుకుందని, నిల్వలను అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వరి కోతలు, ఆక్వా రంగం అవసరాల కోసం కూపన్ల ద్వారా డీజిల్ పంపిణీ చేయాలని తహసీల్దార్లకు ఆదేశించారు. చమురు నిల్వలు తక్కువగా ఉన్న బంకులను గుర్తించి వెంటనే సరఫరా పునరుద్ధరించాలని ఆయిల్ కంపెనీలకు సూచించారు. అక్రమ నిల్వలకు పాల్పడితే నిత్యావసర వస్తువుల చట్టం కింద చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు.