అమలాపురం: పేరూరు వై జంక్షన్ లో రోడ్డు ప్రమాదం

70చూసినవారు
రోడ్డు ప్రమాదంలో గురువారం రాత్రి ఒక యువతికి గాయాలు అయ్యాయి. అమలాపురం రూరల్ మండలం పరిధిలోని పేరూరులో స్థానిక వై జంక్షన్ లో అమలాపురం నుంచి పాసర్లపూడి వైపు స్కూటీపై వెళ్తున్న ఒక యువతి ప్రమాదవశాత్తు అదుపుతప్పి కింద పడిపోయింది. ఆ సమయంలో ఆమెకు గాయాలు కావడంతో వెంటనే స్పందించిన స్థానికులు ఆంబులెన్స్ కు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న సిబ్బంది ఆమెను ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్