కోనసీమలో కేరళ తరహా కొబ్బరి ఉత్పత్తుల తయారీపై అధ్యయనం

7చూసినవారు
కోనసీమలో కేరళ తరహా కొబ్బరి ఉత్పత్తుల తయారీపై అధ్యయనం
కోనసీమలో కేరళ తరహాలో కొబ్బరి ఆధారిత విలువ ఆధారిత ఆహార ఉత్పత్తుల తయారీ సాధ్యాసాధ్యాలపై ప్రత్యేక అధ్యయనం జరుగుతుందని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. అమలాపురం కలెక్టరేట్‌లో మంగళవారం ఎన్. ఆర్. కె ఫుడ్స్ ప్రతినిధి డాక్టర్ వేణుగోపాల్‌తో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ విషయం వెల్లడైంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కొబ్బరి పాలు, క్రీమ్, ప్యాక్డ్ కొబ్బరి నీరు, వర్జిన్ కోకోనట్ ఆయిల్ వంటి ఉత్పత్తులను స్థానికంగా తయారు చేసి, కొబ్బరి రైతులకు గరిష్ట ఆర్థిక ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో అధికారులు, పారిశ్రామికవేత్తలు కృష్ణంరాజు, గోపాలరాజు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you