ఉప్పలగుప్తం మండలం వైరు పేట నుండి చల్లపల్లి స్మశాన వాటికకు వెళ్లే రహదారి అధ్వాన్నంగా మారింది. కంకర రాళ్లు ఎక్కడికక్కడ లేచిపోయి గుంతలమయంగా మారిందని స్థానికులు గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రిపూట స్మశాన వాటికకు వెళ్లేందుకు వీధి దీపాలు లేకపోవడంతో మరింత ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పటికైనా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకుని విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.