
అనపర్తి: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
బిక్కవోలు మండలం పందలపాక సొసైటీలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా "ఖరీఫ్ సీజన్ 2025-26" సంబంధించి రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ఉత్పత్తుల మద్దతు ధరల పట్టిక కర పత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ మాధవరావు, బిక్కవోలు మండల కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

































