రాజమండ్రిలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో శనివారం 'జనతా వారధి' కార్యక్రమం ప్రారంభమైంది. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి పలు సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. స్వీకరించిన ఫిర్యాదులను పరిశీలించి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రూరల్ బీజేపీ కో కన్వీనర్ యానాపు ఏసుతో పాటు పలువురు పాల్గొన్నారు.