గురువారం రాత్రి అనపర్తిలో ఓ మహిళ మెడలో నుంచి 3 కాసుల బంగారు గొలుసును దుండగుడు చోరీ చేశాడు. పందలపాకకు చెందిన విజయలక్ష్మి తన భర్త వీర రాఘవతో కలిసి ద్వారపూడి రైల్వే స్టేషన్ కు వెళ్తుండగా, అనపర్తి కొప్పవరం రోడ్డుపై ఈ ఘటన చోటుచేసుకుంది. దుండగుడు బైక్ పై వచ్చి గొలుసును లాక్కొని పారిపోయాడు. బాధితులు అనపర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.