పెదపూడి మండలం కరకుదురు లో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో రూ. 50 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శనివారం ప్రారంభించారు. ఆలయంలో నూతనంగా నిర్మించిన ముఖ ద్వార మండపం, కళ్యాణ మండపాలను ప్రారంభించారు. ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.