అనపర్తి మండలం రామవరంలో ఏపీ తొలి సీఎంగా, లోక్సభ స్పీకర్ గా, రాష్ట్రపతిగా భారత రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన స్వర్గీయ నీలం సంజీవరెడ్డి వర్ధంతి కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమానికి సంజీవరెడ్డి ఎంతో కృషి చేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.