బిక్కవోలు మండలం తొస్సిపూడిలో డ్రెయిన్ శుభ్రం చేస్తున్న రంగాపురానికి చెందిన వీరబాబు (40) దుర్మరణం పాలయ్యారు. మెయిన్ రోడ్డు కింద డ్రెయిన్ క్లీన్ చేసి బయటకు వస్తుండగా, గోడ కూలి ఆయనపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. తోటి కార్మికులు మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని అనపర్తి ఆసుపత్రికి తరలించారు.