రంగంపేట: విద్యుదాఘాతంతో ఇంటి యజమాని దుర్మరణం

4చూసినవారు
రంగంపేట: విద్యుదాఘాతంతో ఇంటి యజమాని దుర్మరణం
రంగంపేట మండలంలోని రామేశ్వరంపేటలో మంగళవారం 11కేవీ విద్యుత్తు తీగ తగిలి పిల్లల తాతబ్బాయి (51) మృతి చెందారు. తన ఇంటి డాబాపై రెండో అంతస్తు నిర్మాణ పనులు పర్యవేక్షిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. సమీపంలోని విద్యుత్తు వైరు తగలడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనపై మృతుడి కుమారుడు కిషోర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దాపురం పంపించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివప్రసాద్ తెలిపారు.

సంబంధిత పోస్ట్