అనపర్తిలో డీఎస్పీ, ఆర్డీవో కార్యాలయాల ఏర్పాటుకు వినతి

4చూసినవారు
అనపర్తిలో డీఎస్పీ, ఆర్డీవో కార్యాలయాల ఏర్పాటుకు వినతి
అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంగళవారం ఒక వినతిపత్రం సమర్పించారు. అనపర్తిలో డీఎస్పీ మరియు ఆర్డీవో కార్యాలయాలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ప్రస్తుతం ఈ కార్యాలయాలు రాజమండ్రిలో ఉండటం వల్ల అనపర్తి, బిక్కవోలు, రంగంపేటతో పాటు మండపేట, కపిలేశ్వరపురం, రాయవరం వంటి విలీన మండలాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనపర్తిలో ఈ కార్యాలయాలు ఏర్పాటు చేస్తే ప్రజలకు పరిపాలన సౌకర్యవంతంగా మారుతుందని ఆయన విన్నవించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్