పెదపట్నం అగ్రహారంలో అరుదుగా కవల దూడలకు జన్మనిచ్చిన ఆవు

5చూసినవారు
పెదపట్నం అగ్రహారంలో అరుదుగా కవల దూడలకు జన్మనిచ్చిన ఆవు
పి. గన్నవరం మండలం పెదపట్నం అగ్రహారంలో బుధవారం ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది. స్థానిక రైతు దొడ్డ కృష్ణమూర్తికి చెందిన జెర్సీ ఆవు కవల దూడలకు జన్మనిచ్చింది. సాధారణంగా ఆవులు ఒక దూడకే జన్మనిస్తాయని, ఇలా కవలలు పుట్టడం చాలా అరుదని పశువైద్యాధికారి శ్రీరామ్ తెలిపారు. ప్రస్తుతం ఆవుతో పాటు రెండు దూడలు కూడా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నాయని రైతు సంతోషం వ్యక్తం చేశారు. ఈ వింతను చూసేందుకు గ్రామస్థులు ఆసక్తిగా తరలివస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్