బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా అయినవిల్లి మండలంలో సోమవారం కురిసిన భారీ వర్షం రైతులను ఆందోళనకు గురిచేసింది. తొత్తరమూడి గ్రామానికి చెందిన దుర్గారావు అనే రైతు మాట్లాడుతూ, వర్షం కారణంగా ధాన్యాన్ని సకాలంలో జాగ్రత్తపరచలేకపోయానని, దీంతో తక్కువ ధరకే ధాన్యాన్ని నష్టానికి అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది రబీ పంట తమకు ఏమాత్రం కలిసి రాలేదని రైతులు వాపోతున్నారు. వర్షం ధాన్యం రాశులను తడిపి నష్టపరిచింది.