రెండు దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని ముక్తేశ్వరం నుండి కే. జగన్నాధపురం వరకు ఉన్న రహదారిని, పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రత్యేక చొరవతో రూ. 2. 30 కోట్లతో నిర్మించారు. ఈ రహదారి ఏర్పాటుతో దశాబ్దాల సమస్య తీరడంతో హర్షం వ్యక్తం చేస్తూ, బుధవారం ముక్తేశ్వరం సెంటర్‌లో స్థానికులు, అధికారులు మరియు కూటమి నాయకులు ఎమ్మెల్యే చిత్రపటానికి పాలభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.