అయినవిల్లి: వేగంగా సాగుతున్న 'అన్నపూర్ణ నిలయం' పనులు

1413చూసినవారు
పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గురువారం అయినవిల్లి మండలంలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముఖ్యంగా నూతనంగా నిర్మాణంలో ఉన్న అన్నదాన భవనం (అన్నపూర్ణ నిలయం) పనుల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు. పనులు జరుగుతున్న తీరు మరియు అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే సంతృప్తి వ్యక్తం చేశారు. భక్తుల సౌకర్యార్థం ఈ భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్