అయినవిల్లి మండలంలో గత కొద్ది రోజులుగా వింత వాతావరణం నెలకొంది. ప్రతిరోజూ ఉదయం దట్టమైన పొగమంచుతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సూర్యోదయం తర్వాత మంచు తెరలు తొలగగానే ఎండ తీవ్రత పెరిగి, మధ్యాహ్నానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం చలి, మధ్యాహ్నం వేడితో కూడిన ఈ అనూహ్య వాతావరణ మార్పులపై స్థానికులు మంగళవారం చర్చించుకుంటున్నారు.