ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానానికి శనివారం (మే 30న) పూజలు, టికెట్ల రూపంలో మొత్తం రూ. 2, 65, 698 ఆదాయం వచ్చినట్లు ఆలయ సహాయ కమిషనర్, ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ఇందులో అన్నప్రసాదం విరాళాల ద్వారా రూ. 1, 26, 623, ఇతర విరాళాల రూపంలో రూ. 6, 124 లభించాయి. శనివారం స్వామివారిని 433 మంది ప్రత్యేక దర్శనం ద్వారా దర్శించుకోగా, 25 లక్ష్మీ గణపతి హోమాలు, 24 లఘున్యాస అభిషేకాలు జరిగాయి. అలాగే 2, 653 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.