గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ పట్ల ప్రజలను అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపి చైతన్య పరచాలని జిల్లా పంచాయతీరాజ్ అధికారి శాంతలక్ష్మి సూచించారు. అంబాజీపేట మండల పరిషత్ కార్యాలయం వద్ద బుధవారం నిర్వహించిన పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పరిసరాల పరిశుభ్రత విషయంలో ప్రజలకు కల్పించాల్సిన అవగాహన కార్యక్రమాల గురించి సూచించారు.