అంబాజీపేట: 'రైతు బలపడితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం'

7చూసినవారు
అంబాజీపేట మండలం చిరుతపూడి రైతు సేవా కేంద్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన అవగాహన వర్క్‌షాప్‌లో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే రబీ, ఖరీఫ్ సీజన్‌లతో పాటు వరుసగా మూడు పంటకాలానికి సంబంధించిన పెట్టుబడులు, దిగుబడులు, లాభనష్టాల అంచనాలు రైతులకు స్పష్టంగా అందేలా వ్యవసాయ అధికారులు సమగ్ర సూచనలు అందిస్తారని తెలిపారు. రైతులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :