రాజవరం–పొదలాడ ఆర్ అండ్ బి రాష్ట్ర రహదారిపై నాగుల్లంక వద్ద గత నెల 25న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మరో మహిళ మంగళవారం మృతి చెందింది. ప్రయాణికుల ఆటోను టిప్పర్ ఢీకొన్న ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న నాట్ర కృష్ణకుమారి (55) మరణించినట్లు ఎస్సై బి. శివకృష్ణ తెలిపారు. మృతురాలిది పశ్చిమగోదావరి జిల్లా దొడ్డిపట్ల శివారు పెదలంక గ్రామం. ప్రమాదం జరిగిన రోజే మల్లాడి పద్మావతి అక్కడికక్కడే మృతి చెందగా, తాజాగా కృష్ణకుమారి మరణంతో మృతుల సంఖ్య రెండుకు చేరింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.