మామిడికుదురు మండలం అప్పన్నపల్లిలోని వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి శనివారం కావడంతో వేకువజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ అర్చకులు సుప్రభాత సేవ అనంతరం తొలి హారతిని వైభవంగా నిర్వహించారు. భారీగా విచ్చేసిన భక్తులకు ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.