మామిడికుదురు మండలంలోని అప్పనపల్లిలో ఉన్న శ్రీ బాల బాలాజీ స్వామి వారి ఆలయ సన్నిధిలో ఆలయ సిబ్బంది హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ మేరకు దేవదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఆలయ సిబ్బంది ఉండే ఆదాయాన్ని లెక్కిస్తున్నారు. స్వామివారి ఆలయ సన్నిధిలోని వివిధ హుండీలను తెరిచి లెక్కించడం జరుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు.