అంబాజీపేట మండలం మాచవరంలో బుధవారం జరిగిన ‘స్వచ్ఛ పథం’ కార్యక్రమంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్మ కమిటీ డైరెక్టర్ పత్తి దత్తుడు పాల్గొన్నారు. గ్రామాల్లో స్వచ్ఛమైన వాతావరణం పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రత్యేక వాహనం ద్వారా చెత్త సేకరించి నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు పారిశుద్ధ్యంపై అవగాహన పెంచుకుని గ్రామ శుభ్రతలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.