అయినవిల్లి మండలంలోని ముక్తేశ్వరంలో మురుగు కాలువపై ఉన్న వంతెన ప్రస్తుతం ప్రమాదకరంగా మారింది. వంతెనకు ఇరువైపులా ఉన్న రక్షణ గోడలు కూలిపోవడంతో ప్రయాణం అత్యంత ప్రమాదకరంగా తయారైంది. రాత్రి వేళల్లో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు అప్రమత్తత కోల్పోతే కాలువలో పడిపోయే ప్రమాదం ఉందని స్థానికులు శనివారం ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి, రక్షణ గోడలకు మరమ్మతులు చేపట్టి ప్రాణనష్టం జరగకుండా చూడాలని గ్రామస్థులు కోరుతున్నారు.