అంబాజీపేట మండలం మాచవరం గ్రామపంచాయతీ పరిధిలో లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సోమవారం స్వయంగా అందజేశారు. నిరుపేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా, ప్రతి నెలా ఒకటో తేదీనే ప్రభుత్వ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే నేరుగా పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ పంపిణీ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.