గురువారం మామిడికుదురు మండలం తాటిపాక వంతెన సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద జరి
గిన రోడ్డు ప్రమాదంలో నగరం గ్రామానికి చెందిన గుబ్బల మణికంఠ తీవ్రంగా గాయపడ్డాడు. రెండు బైకులు అతివేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. 108 సిబ్బంది ఈశ్వర్, బలరామకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడికి ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం అమలాపురం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.