కొండుకుదురులో వైభవంగా అమ్మవారి జాతర: పాల్గొన్న ఎమ్మెల్యే

5చూసినవారు
అయినవిల్లి మండలం కొండుకుదురు గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన ఆర్ల అక్కమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవంలో పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామస్థులు, భక్తులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, స్థానిక సంప్రదాయాలను, ఆచారాలను కాపాడుకుంటూ ఇలాంటి ఆధ్యాత్మిక వేడుకలు జరుపుకోవడం అభినందనీయమని కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్