వాతావరణంలో ఆకస్మిక మార్పుల కారణంగా అయినవిల్లి మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ఉదయం భారీ వర్షం కురిసింది. ఈ వర్షం వల్ల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వ్యవసాయ పనులు, కూలీ పనులకు వెళ్లేవారు, వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.