అంబాజీపేట మండలంలో గురువారం తెలుగుదేశం పార్టీ నాయకులు క్లస్టర్ల వారీగా 'మహానాడు' కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో,
ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో రాష్ట్ర బీసీ సహకార కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంత కుమారి,
టీడీపీ నియోజకవర్గ కోకన్వీనర్ దాసరి వీర వెంకట సత్యనారాయణ (చిట్టిబాబు) ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారు
ఎన్టీఆర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి మహానాడు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు.