తెలుగుదేశం పార్టీ శ్రేణులు మహానాడును ఒక పండుగలా జరుపుకోవాలని అమలాపురం ఎంపీ గంటి హరీశ్ మాధుర్ పిలుపునిచ్చారు. బుధవారం అంబాజీపేటలో నిర్వహించిన మహానాడు మహోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని, పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం వర్చువల్ మహానాడు డిజిటల్ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో
టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి, ప్రధాన కార్యదర్శి గంధం పల్లం రాజుతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.