మామిడికుదురు: వైనతేయ గోదావరిలో దిగి వ్యక్తి గల్లంతు

3చూసినవారు
మామిడికుదురు మండలం పెదపట్నంలంక గ్రామం బొక్కావారిపాలెంలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం వైనతేయ గోదావరి నదిలో స్నానానికి దిగిన బండారి శ్రీనివాసరావు (55) ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. స్థానికులు పడవల సహాయంతో, లైట్లు వేసుకుని నదిలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. బాధితుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్