అప్పనపల్లి కాజ్‌వేకు ఎమ్మెల్యే శంకుస్థాపన

3చూసినవారు
పి. గన్నవరం నియోజకవర్గంలో లంక గ్రామాల వరద కష్టాలకు త్వరలో తెరపడనుంది. మామిడికుదురు మండలం అప్పనపల్లి వద్ద గోదావరి పాయపై రూ. 14.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న కాజ్‌వేకు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గురువారం శంకుస్థాపన చేశారు. వరద సమయంలో అప్పనపల్లి, పెదపట్నంలంక, బి. దొడ్డవరం ప్రజలు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నిధులు మంజూరు చేయించామని, ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.