పి. గన్నవరం ఎంపీపీ కార్యాలయంలో ఏపీ షెడ్యూల్ కాస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పదో తరగతి ప్రతిభావంతులకు సోమవారం సాయంత్రం అభినందన సభ జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ విద్యార్థులను ప్రశంసాపత్రాలతో సత్కరించారు. టాలెంట్ ఎవరి సొత్తు కాదని, కష్టపడితే విజయాలు సాధ్యమని, బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని చదువులో రాణించాలని, ఉన్నత స్థాయికి ఎదిగాక సమాజానికి సేవ చేయాలని ఎమ్మెల్యే విద్యార్థులకు పిలుపునిచ్చారు.