పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ శనివారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ, గ్రామాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి పంచాయతీ కార్యదర్శులు ప్రాధాన్యత ఇవ్వకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా వేసవి నేపథ్యంలో తాగునీటి ఎద్దడి రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులదేనని స్పష్టం చేశారు. గ్రామాల్లో మౌలిక వసతుల సమస్యలను గుర్తించి, వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.