పి. గన్నవరం: సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

16చూసినవారు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 17 నెలల్లో 22 సార్లు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశామని పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఆయన పి. గన్నవరంలోని తన కార్యాలయంలో 50 మందికి రూ. 41,53,133 విలువైన చెక్కులను అందించారు. సీఎంఆర్ఎఫ్ నిధులు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకే జమ అవుతాయని, మధ్యవర్తులకు తావులేదని ఆయన పేర్కొన్నారు.