పి. గన్నవరంలో సుమారు రూ. 70 లక్షల వ్యయంతో చేపట్టిన డ్రైనేజీ నిర్మాణ పనులను ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సోమవారం కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. పనుల తీరుపై అధికారులు ఇచ్చిన వివరణతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా, శాశ్వత పరిష్కారం చూపేలా డ్రైనేజీ నిర్మాణం ఉండాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. త్వరలోనే సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌తో సమీక్షా సమావేశం నిర్వహించి లోపాలను సరిదిద్దుతామని ఆయన వెల్లడించారు.