పి. గన్నవరం: ఓట్ల వెరిఫికేషన్‌పై టీడీపీ నాయకుల సమావేశం

11చూసినవారు
స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఓట్ల వెరిఫికేషన్‌పై ఎలాంటి సందేహాలు, ఇబ్బందులు ఉన్నా తెలియజేయాలని పి. గన్నవరం మండల 5వ టీడీపీ క్లస్టర్ ఇంచార్జ్ కుంపట్ల నాయుడు సూచించారు. యూనిట్ ఇన్చార్జ్ నిమ్మకాయల శేషు ఆధ్వర్యంలో ముంగండపాలెం, కే. ముంజవరం గ్రామాల పార్టీ నాయకులతో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారు. బూత్ స్థాయి నుండి ఓట్ల వెరిఫికేషన్ సక్రమంగా జరిగేలా చూడాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు మట్టపర్తి మణికంఠ, గుత్తుల బాలుతో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్