పి. గన్నవరం నియోజకవర్గంలో పదవ తరగతి ఫలితాల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గురువారం ఘనంగా సన్మానించారు. విద్యార్థులకు పారితోషకంతో పాటు కాలేజీ చదువులకు అవసరమైన బ్యాగులు, పుస్తకాలను పంపిణీ చేశారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఫలితాలు సాధించడంలో ఉపాధ్యాయుల కృషి మరువలేనిదని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల కూటమి నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.