సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి, లంకలగన్నవరానికి చెందిన గాయత్రీ లక్ష్మీప్రసన్న అనే యువతి నుంచి రూ. 2.65 లక్షలు వసూలు చేసి మోసం చేసిన తెనాలికి చెందిన స్టెఫీ ఎవాంజలిన్, మణికంఠ అనే ఇద్దరిపై పి. గన్నవరం పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లోని ఒక డొల్ల కంపెనీలో ఉద్యోగం ఇప్పించినా, ఐదు నెలలైనా జీతం రాకపోవడంతో బాధితురాలు మోసపోయినట్లు గుర్తించింది. బాధితురాలి తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు ఎస్సై శివకృష్ణ దర్యాప్తు చేపట్టారు.