రాష్ట్రంలోని నిరంకుశ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పి. గన్నవరం
వైసీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. పాసర్లపూడిలో మంగళవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో నెలకొన్న డీజిల్ సమస్యపై రైతులు, వినియోగదారుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ప్రకటించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వైకాపా విశ్రమించదని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కార్యకర్తలు పోరాటానికి సిద్ధం కావాలని ఆయన కోరారు.