అయినవిల్లి మండలంలోని వీరవల్లిపాలెం గ్రామంలో ఆదివారం రాత్రి తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షం కారణంగా సూర్యనారాయణమూర్తి సత్రం వద్ద నీరు నిలిచిపోయింది. దీంతో స్థానికులు, విద్యార్థులు సోమవారం ఉదయం నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి, నిలిచిపోయిన వర్షపు నీటిని బయటకు మళ్లించి, శానిటేషన్ పనులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.