అయినవిల్లిలో సంకటహర చతుర్థి వేడుకలు

6చూసినవారు
గురువారం అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో సంకటహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి శాస్త్రోక్తంగా నిర్వహించిన లఘున్యాస అభిషేక సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సంకటాలను హరించే వినాయకుడిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. ఆలయ అర్చకులు స్వామివారిని విశేషంగా అలంకరించి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్