ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (APSDMA) అంచనాల ప్రకారం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది. ప్రకాశం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న నేపథ్యంలో, కృష్ణా నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.