వీరవల్లిపాలెం: గోదావరిలో పడవ మునిగి యువకుడు మృతి!

6చూసినవారు
వీరవల్లిపాలెం: గోదావరిలో పడవ మునిగి యువకుడు మృతి!
మంగళవారం అయినవిల్లి మండలం వీరవల్లిపాలెంలో విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో చేపల వేటకు వెళ్లిన మల్లాడి యేసు రాజు (21) అనే యువకుడు పడవ ఒరిగిపోవడంతో నీటిలో మునిగి మరణించాడు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గతంలో యేసు రాజు తండ్రి కూడా ఇలాగే గోదావరిలో వేటకు వెళ్లి మృతి చెందారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు నదికి బలికావడంతో గ్రామస్థులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రభుత్వం స్పందించి బాధితుడి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్