అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థిని ముద్దన అనూష, వచ్చే నెల 6 నుండి 8వ తేదీ వరకు ఢిల్లీలో జరిగే స్పేస్ వీక్ అండ్ సైన్స్ ఎక్స్పోజర్ అండ్ ఎడ్యుకేషనల్ టూర్ కు ఎంపికైంది. జిల్లా నుండి ఇద్దరు మాత్రమే ఎంపికయ్యే ఈ టూర్ కు తమ విద్యార్థిని ఎంపికవడం పట్ల ప్రధానోపాధ్యాయులు అడబాల సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆయన శుక్రవారం తెలిపారు.