
వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలోనే ఐ లవ్ యు పార్క్ అభివృద్ధి: బాలరాజు
నిడదవోలు పట్టణం మున్సిపల్ వైస్ చైర్మన్ యలగాడ బాలరాజు శనివారం మాట్లాడుతూ, వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలోనే పట్టణంలోని గణపతి సెంటర్లో ఐ లవ్ యు పార్క్ అభివృద్ధి చేశామని తెలిపారు. గతంలో జరిగిన పనులకే రంగులు, సున్నాలు వేసి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. 60వ వార్షికోత్సవ వేడుకలను మున్సిపల్ చైర్మన్ ఏకపక్షంగా నిర్వహిస్తున్నారని, దీనిపై తనకు, కౌన్సిలర్లకు, అఖిలపక్షానికి సమాచారం లేదని ఆయన అన్నారు.

































