దేవరపల్లి జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం కోడిగుడ్లు లోడుతో రాజమండ్రి వైపు వెళ్తున్న లారీ అదుపుతప్పి డ్రైనేజీలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.