తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలంలో జరిగిన
టీడీపీ పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు, గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, భవిష్యత్ కార్యాచరణపై సమగ్రంగా చర్చించారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని, ప్రతి కార్యకర్త ప్రజలకు మరింత చేరువై ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.