రాజమండ్రి ఆదిత్య మహిళా డిగ్రీ & పీజీ కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. డిసెంబర్ 1 ఎయిడ్స్ డే సందర్భంగా, విద్యార్థులు కళాశాల నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, ఎయిడ్స్ ను తరిమికొట్టాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.